Nookaalamma Temple in Anakapalli Andhra pradesh

అనకాపల్లి నూకంభికా (నూకాలమ్మ) ఆలయం

500 సంవత్సరముల చరిత్ర గలది.నూకాలమ్మనే పూర్వ కాలంలో అనగాదేవిగా పిలిచేవారు. 9 శక్తి స్వరూపలలో ఈ రూపం ఒకటి. ఇది ఆంధ్రప్రదేస్ లోని అనకాపల్లిలో ,గవరపాలెంలో వున్నది. ఉత్తరాంద్ర అమ్మవారిగా ఎంతో ప్రసిద్ది చెందింది.సంతానం లేనివారు ఈ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతారు అని భక్తుల విశ్వాసం. చిన్నపిల్లలని అమ్మవారి పాదాలదగ్గర ఉంచితే అనారోగ్యాలు దరిచేరవని నమ్ముతారు. భక్తుల తో ఎల్లప్పుడూ రద్దీగా వుండే ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందింది.

NookamBhika Devi Temple Anakapalli AP

NookamBhika Devi Temple Anakapalli AP

ఆలయ ప్రాముఖ్యత : ఈ ఆలయంలోని ఇప్పుడు వున్న ఈ విగ్రహాన్ని 1969 వ సం. లో ప్రతిష్టాపన చేసారు. చోడవరానికి చెందిని ఎల్లయ్య అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. నవతాల విగ్రహంగా ఈ మూర్తిని పేర్కొంటారు. అనగా శిరస్సు నుండి పాదాలవరకూ 9 భాగాలుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమ్మవారి ముఖం కొలత 14 అంగుళాలు వుంటుంది. మిగిలిన 8 భాగాలు 14 అంగుళాల చొప్పున మొత్తం 126 అంగుళాల పొడవు విగ్రహం మరెక్కడా లేనంతగా ఎంతో తేజో మయంగా వుంటుంది, చతుర్భుజాల తోనూ, స్వర్ణాభరణాలతొను వర్ణనాతీతంగా వుంటుంది. పై ఎడమచేతిలో నాగపాశం ,కుడిచేతిలో త్రిశూలం, క్రింద కుడిచేతిలో ఖడ్గం ఎడమచేతిలో భరినలతొ నూకాలమ్మ దర్శనం ఇస్తుంది. అమ్మవారికి ఇరు వైపులా వున్న స్తంభాలపై గజ,సింహకృతులు కలగలిపిన రూపాలు ఉంటాయి. గోపురాలపై పలు రూపాలలో వున్న అమ్మవారి మూర్తులు కనిపిస్తాయి. కొబ్బరితోట మధ్యలో ఈ ఆలయం వుంటుంది. ఆలయ ముఖ మండపంపై మహిసాసుర మర్దిని విగ్రహం వుంటుంది. ఈ మండపం నలువైపులా వివిధ రూపాలులో వున్న అమ్మవారు దర్శన మిస్తుంది. ఈ ఆలయంలో తూర్పు దిక్కున అమ్మకి సోదరుడు ఐన పోతురాజు ని కూడా దర్శించుకోవచ్చు. విజయనగర రాజుల కాలంనాటి ఆలయాల్లో పోతురాజు ప్రస్తావన ఎక్కువగా వుంటుంది. పాల్గుణ అమావాస్య మొదలుకుని చైత్ర అమావాస్య వరకు ప్రతి ఏటా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం పైన వున్న మండపం లో కుంకుమ పూజలు ఎల్లప్పుడూ జరుగుతూనే వుంటాయి.

స్థల పురాణం : కాకతీయుల కాలంలో ఈ ఆలయం విశిష్ట ఖ్యాతిని పొందింది. ఆ కాలంలో ఈ అమ్మవారిని కాకతాంబగా ఆరాదించేవారు. కాకతీయ ప్రభువుల కాలం అంతరించాక ఈ ఆలయ వైభవం కూడా అంతరించింది. క్రీ.శ. 1450 వ సం. లో ఆర్ఖాట్ నవాబు సైన్యాదిపతి అయిన కాకర్లపూడి అప్పలరాజు ఎంతో నైపుణ్యంతో యుద్ధాలు చేసి విశాఖ జిల్లా ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. అందుకు నజరానాగా నవాబు పాయకరావు అన్న బిరుదుతో పాటు, సబ్బవరం ప్రాంతానికి పాలకుడిగా చేసారు. అప్పుడు అప్పలరాజు అనకాపల్లి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పాలన చేస్తూ అనకాపల్లిలో కోటకూడా నిర్మించారు. కోటకు ధక్షిణ భాగాన వున్న ఈ ఆలయంలో ఇలవేల్పు అయిన కాకతాంబిక విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి నుండి ఈ ఆలయం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది . తరువాత విజయనగర రాజుల కాలంలో కాకతాంబికను నూకాలమ్మగా ఆరాదించేవారు. అప్పుడు పంటలు సమంగా పండుతున్నాయి అంటే ఈ అమ్మవారే కారణమని బావించేవారు.

చేరుకునే విధానం : అనకాపల్లి రైల్వే స్టేషన్ కు 3 కి. మీ. , బస్ స్టాప్ కు 2కి. మీ.దూరంలో వుంటుంది. ఇక్కడి నుంచి అటో ,రిక్షా సదుపాయం కలదు.

Address

  • Nookaalamma Temple in Anakapalli Andhra pradesh
    Anakapalle

    Anakapalle, Andhra Pradesh - 531001

Timings

Day Timings
  • Media

Most Read Articles