Ontimitta Rama Temple in Kadapa Andhra Pradesh

ఈ విగ్రహాలకు జాంబవంతుని చేత ప్రాణ ప్రతిష్ట గావించబడింది. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణకోసం శ్రీ రామ,లక్ష్మణులను చిన్నతనంలోనే ఈ ప్రదేశమునకు రమ్మని అడిగినప్పుడు ,శ్రీ రాముడు వచ్చి తాటకి సంహారం ఈ ప్రదేశంలోనే చేసాడు.ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించదు. ఈ ఆలయం లో శ్రీ రాముడు, ఆంజనేయుడు ల కలయక ముందు విగ్రహ ప్రతిష్ట జరిగింది,అందుచేత ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ కనిపించదు. 1652 వ సంవత్సరంలో జీన్ బాప్తిస్తే టావెర్నిఎర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు దీనిని సందర్శించి,ఈ ఆలయ నిర్మాణాన్ని ,ఆలయ శిల్ప సౌందర్యాన్ని ఎంతోకొనియాడారు. భారతీయ అతిపెద్ద గోపురాలలో ఇదిఒకటి అన్నారు. ఈ ఆలయాన్ని ముస్లింలు కూడా దర్శించు కుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడపజిల్లాలో, కోరజంపేట మండలంలోని ఒంటిమిట్ట అనే గ్రామంలో వుంది.

ఆలయ ప్రాముఖ్యత : 450 సంవత్సరముల ముందే ఈ ఆలయ నిర్మాణం జరిగింది.ఈ ఆలయానికి మూడు గోపుర ద్వారాలు వుంటాయి.ఈగోపురాల నిర్మాణం చోళుల పద్దతిలో వుంటుంది. ఆలయ ముఖద్వార ఎత్తు 160అడుగులు వుంటుంది.ఆలయ ప్రాంగణంలో 32 సిళా స్తంభాలతో నిర్మించిన రంగ మండపం వుంది.ఈ రంగ మండప విజయనగర శిల్పకళా ఆకృతిని కలిగి వుంటుంది.ఈ మండపంలోని స్తంభాలకు అందమైన అప్సరసల శిల్పాలు చెక్కబడి వుంటాయి. దక్షిణం వైపు మండపానికి ఆధారంగా వున్న స్తంభాలలో మద్య స్తంభం పైన విష్ణువు ,శ్రీ కృష్ణుని శిల్పాలను చూడవచ్చు. మండపం ప్రతీ కోణంలో వున్న స్తంభాలకి మూడువైపుల అప్సరసల ,దేవతల శిల్పాలు చెక్కబడి వుంటాయి. ఈ మండపం మధ్య భాగాన వున్న స్తంభానికి యాళి ఆకారాన్ని చూడవచ్చు. మండపంలోని ఒక స్తంభం పైన శ్రీ రామ,లక్ష్మణ శిల్పాలు చెక్కబడి వుంటాయి.ఇక్కడ రాముడు నుంచొని కుడిచేత్తో భానాన్ని,ఎడమ చేత్తో విల్లుని పట్టుకున్నట్లు, లక్ష్మణుడు త్రిభంగ ఆకృతిలో ఉన్న సిల్పాలు చెక్కబడి వుంటాయి.ఈ ఆలయ గోడలపైన శ్రీమన్నారాయణ అవతారాలు ,రామాయణ ,భాగవత ఘట్టాలు చెక్కబడి వుంటాయి. ఈ ఆలయ నిర్మాణం మూడు దసలగా జరిగినట్టు చరిత్ర చెప్తుంది.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం మండపం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం మండపం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం శిల్పాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం శిల్పాలు
 
దేశంలోని ఏ ఆలయానికి లేని రెండు ప్రాముక్యతలు ఈ ఆలయానికి వున్నాయి. అన్ని దేవాలయాలలో రాముని కళ్యాణము మద్యన్నాము జరిగితే ,ఇక్కడ మాత్రమే రాత్రి నిండు పౌర్నమిలో జరుగుతుంది . రెండవది ఆంజనేయస్వామి విగ్రహం సీతా ,రామ ,లక్ష్మణులతో వుండదు. ఆలయంలో వేరే ప్రదేశంలో గండి అనేచోట వుంటుంది. ఈ విగ్రహాన్ని శ్రీ రాముడే ప్రతిష్ట గావించాడని అంటారు. ఈ ఆలయం కింది భాగంలో గుండం (కోనేరు)వుంది. దీనిని శ్రీ రాముడే తన భానంతో సృష్టించాడని ప్రతీతి.

స్థలపురాణం : శ్రీ రామ ,లక్ష్మణులను చిన్నతనంలోనే ,విశ్వామిత్రుడు తమ యాగ రక్షణ కోసం ఈ ప్రదేసానికి తీసుకుని వస్తాడు. యాగానికి ఆటంకం కలిగించిన తాటకి మొదలైన రాక్షసులను శ్రీ రాముడు సంహారం చేసాడు. అదేవిదంగా సీతారామ కల్యాణం తరువాత మ్రుఖండ మహర్షి,శ్రుంగి మహర్షి తాము చేస్తున్న యాగాన్ని రాక్షసుల భారినుండి రక్షించమని శ్రీ రాముని కోరుతారు. అప్పుడు శ్రీ రాముడు అమ్ముల పొద ,కత్తి ,కోదండం ధరించి యాగ సంరక్షణ చేసాడు. అందుకు కృతజ్ఞతగా ఆ మహర్షులు సీత ,రామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలపై చెక్కించారు. ఆ సమయానికి శ్రీ రాముడు ఆంజనేయస్వామిని కలవనందున ఆంజనేయ విగ్రహం వుండదు. ఆ తరువాత ఆ విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేసాడు.

చరిత్రలో మరొక కధ కూడా వుంది. ఒంటోడు ,మిట్టోడు అనే ఇద్దరు దొంగలు దొంగతనం చేస్తూ వుండేవారు. దొంగతనం చేసిన సొమ్మును కాపాడడానికి ఒక్కరోజులో ఈ ఆలయ నిర్మాణం చేసారు. తరువాత దొంగతనాలు మానేసి శ్రీ రామ మహిమ వలన భక్తులుగా మారిపోయారు. ఆ తరువాత దేహ త్యాగం చేసి ఇక్కడే శిలా విగ్రహాలుగా మారిపోయారు. ఆలయంలోనికి ప్రవేసించే చోటే వీరి విగ్రహాలు కనపడతాయి. అందుకే దీనిని ఒంటిమిట్ట దేవాలయం అంటారు.

19 వ శతాబ్దంలో వావిలి కొలను సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని పునరుద్దరన చేసారు.ఈయన ఆంధ్ర వాల్మీకిగా పిలవబడతారు. కొబ్బరి చిప్పను జోలిగా చేసి ,భిక్షాటన చేసి సుమారు 10 లక్షల విలువతో సీత ,రామ ,లక్ష్మణ విగ్రహాలకు ఆభరనాలను చేయించారు.ఆంద్ర మహా భారతాన్ని రచించిన పోతన తానూ ఈ ప్రదేశం వాడినే అని చెప్తాడు. తానూ రచించిన భాగవతాన్ని ఈ కోదండ రామునికే అంకితం ఇచ్చాడు. ఈ సహజ కవికి ఈ ఆలయం లో చిన్న మందిరం కట్టి విగ్రహం ప్రతిష్ట చేసారు. తాళ్ళపాఖ అన్నమయ్య కూడా ఒంటిమిట్ట సమీపప్రాంతానికి చెందినవాడే.అన్నమయ్య ఈ ఆలయంలో వుండి కొన్ని కీర్తనలు కూడా రచించాడు.

ఇమాంబెఖ్ 1640 వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీఖాన్ ప్రతినిధి. ఒకసారి ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు . చిత్తసుద్దితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు అని చెప్పారట. అప్పడు అతను మూడు సార్లు రామ అని పిలిస్తే మూడు సార్లూ ప్రతిగా "ఓ" అని వినిపించిందంట. అప్పటినుంచి అతను శ్రీ రాముని భక్తునిగా మారిపోయి ,ఆలయ ప్రాంగణంలో మంచి నీరు కోసం బావులను తవ్వించాడు.అతని ప్రభావంతో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం.

చేరుకునేవిదానం : ఒంటిమిట్ట రైల్వే స్టేసన్ కు 1.5 కి. మీ. దూరంలోని ,భాకరాపేట రైల్వే స్టేసన్ కు 8. 2 కి. మీ. దూరంలో కడప రైల్వే స్టేసన్ కు 25 కి. మీ. దూరంలో వుంది.కడప నుండి ఒంటిమిట్టకు బస్సు సదుపాయము కలదు.

Address

  • Ontimitta Rama Temple in Kadapa Andhra Pradesh
    Ontimitta

    Kadapa, Andhra Pradesh - 516213
  • +91-08589-274123

Timings

Day Timings
  • Media

Most Read Articles