Ramateertham Lord Rama Temple in Vizianagaram Andhrapradesh

రామతీర్థం ,శ్రీ రాముని దేవాలయం

రామతీర్థం,శ్ర్రీ రాముని దేవాలయమునకు 1000 సంవత్సరముల ప్రాచీన చరిత్ర కలిగినది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 2వ భద్రాచలం గా పిలవబడుతుంది.విజయనగరం జిల్లా,నెల్లిమర్ల మండలం రామతీర్థం అనే గ్రామం లో సీత ,రామ,లక్ష్మణ సమేతంగా ఈ దేవాలయంలో కొలువై వున్నారు.

ఇక్కడ ఒకే ప్రదేశంలో హిందూ,బౌద్ద,జైన మతముల దేవాలయ చిహ్నములు చూడవచ్చు.
స్థల పురాణం : ఈ ప్రదేశంలో శ్రీ రాముడు త్రేతా యుగములో తన వనవాస సమయంలోని,ద్వాపర యుగములో పాండవులు తమ ఆరణ్యవాస సమయంలో సంచరించినట్ట్లు పురాణములలో తెలియజేయబదినది. పాండవులు అరణ్య వాసమునకు వెళ్ళే సమయములో శ్రీ కృష్ణుని తమతో రమ్మని అడిగినప్పుడు,శ్రీ కృష్ణుడు సున్నితంగా తిరస్కరించి,పాండవులకు తన మహిమ తో సీత,రామ,లక్ష్మణుని విగ్రహములను సృష్టించి,త్త్రేతా యుగమున తానే శ్రీ రామునిగా ఈ దండకారన్యమున సంచరించానని తెలిపి,తమని ఆప్రదెసమునకు వెళ్లి నిత్యము ఈ విగ్రహ మూర్తులను పూజించమని తెలియజెసెను.అంతట పాండవులు ఈ ప్రదేశములో దేవాలయమును నిర్మించి,నిత్యము పూజలు చేసేవారు ,పాండవులు అజ్ఞాతవాసమునకు వెళ్ళే ముందు,వేదగర్భుడు అనే పండితునికి ఈ దేవాలయమును అప్పగించారు.కొంత కాలానికి బౌద్ధులు ఈ ప్రదేశమున బౌద్ద మత ప్రచారము చేయునప్పుడు,వేదగర్భుని వంశీయులు ఈ విగ్రహ మూర్తులను భూ గర్భమున దాచిపెట్టారు. ఒకనాడు ఒక మూగ ముసలి అవ్వ అడవికి వెళ్ళినపుడు,పెద్ద గాలివాన లో చిక్కుకొని ,ఆ రాత్రి అక్కడే ఉండిపోగా,ఆ సమయములో ఒక తేజస్సు సీతా,రామ,లక్ష్మణుని గా దర్శనమిచ్చి ,ఆ ముసలి అవ్వ నాలుక మీద బీజాక్షరములు వ్రాసి,ఈ ప్రదేశములో తాము చాలా కాలముగా కొలువుతీరి ఉన్నామని, అప్పటి పూసపాటి రాజ వంశీయులకు చెప్పమని ఉపదేశించారు.అదే రోజు ఉదయమున పూసపాటి వంశ రాజునకు స్వప్నంలో దర్శనమిచ్చి ,ముసలి అవ్వ చెప్పినట్టు చేయమని ఆదేశించారు.ఆ విధంగా అక్కడి విగ్రహ మూర్తులు ఆ వర్షపు నీటి(నిరు అనగా తీర్థం) నుండి తీయబడి,దేవాలయము నిర్మించటం జరిగినది కావున ఈ ప్రదేశము రామ తీర్థం గా ప్రసిద్ది చెందినది.

శ్ర్రీ రాముని దేవాలయమునకు 1000 సంవత్సరముల ప్రాచీన చరిత్ర కలిగినది

శ్ర్రీ రాముని దేవాలయమునకు 1000 సంవత్సరముల ప్రాచీన చరిత్ర కలిగినది

దేవాలయ ప్రత్యేకత :ఈ దేవాలయమునకు వాయువ్య దిశలో 3 కొండల సమూహము,దక్షిణ భాగమున ఒక కోనేరు వున్నవి. మొదటి కొండ బోధి కొండ గా పిలవబడును.దీని ఎత్తు 1500 అడుగులు.పూర్వము బౌద్ధులు ఈ కొండను తమ మత ప్రచారమునకు ప్రధాన కేంద్రముగా వుపయోగించుకొన్నారు.నేటికి ఇక్కడ బౌద్ధ స్తూపములు ,వారి నివాస గృహ శకలములు వున్నవి.

గురు భక్తుల కొండ

గురు భక్తుల కొండ

రెండవది గురు భక్తుల((జైన మతస్థులు)) కొండ.ఈ కొండ పైన జైన మతస్థుల నివాస గృహ చిహ్నములు కలవు.దీని గుహలో 6 అడుగుల దుర్గా దేవి విగ్రహము కలదు.అందువలన దీనిని దుర్గ కొండ అని కూడా అంటారు

మూడవది నీలచల కొండ,రామ దేవాలయమునకు ఉత్తరమున కలదు.ఇది 1800 అడుగులు ఎత్తు,2 కిలోమీటర్ల విస్తీర్ణం కల ఏక శిలా కొండ. ఇది ఒక గంధకం కొండ.ఈ కొండ పైన సీత,రాములు మరియు పాండవులు సంచరించిన చిహ్నములు కలవు. ఈ కొండమీద పాండవులు నిర్మించిన కోదండ రాముని ఆలయము,ఆ ప్రక్కనే శ్రీరాముని చేత సృష్టించబడిన పాతాళ గంగ అనే నీటి మడుగు కలదు.

కొండ బోధి కొండ గా పిలవబడును

కొండ బోధి కొండ గా పిలవబడును

సందర్శన ,దర్శనము :
రామతీర్థం విజయనగరం నుండి 12 కిలో మీటర్లు దూరంలో వుంది . ఇక్కడి నుండి బస్సు మరియు ఆటో సదుపాయం కలదు.శ్రీ రామ నవమి ,శివ రాత్రి మరియు ఏకాదశి సమయములలో ప్రత్యెక పూజలు నిర్వహించబడును.జూలై నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రదేశము దర్శించుటకు అనువైనది.

Address

  • Ramateertham Lord Rama Temple in Vizianagaram Andhrapradesh
    Ramatheertham Road

    Nellimarla, Andhra Pradesh - 535217

Timings

Day Timings
  • Media

Most Read Articles