Sri paarvati Jadala Rama shiva temple in Nalgonda Andhra pradesh

శ్రీ పార్వతి జడల రామలింగేస్వరస్వామి ఆలయం

త్రేతాయుగంలో పరశురాముని చేత ఒక చిన్న గుహలో పశ్చిమ ముఖంగా ప్రతిష్ట గావించాబడిన ఈ లింగం శ్రీ పార్వతి జడలరామలింగేస్వరస్వామి ఆలయంగా ఎంతో ప్రసిద్ది చెందింది.పరశురాముడు క్షత్రియ సంహారం తరువాత పాప ప్రక్షాళన కోసం ప్రతిష్టించిన 108 లింగాలలో ఇది చివరి లింగం. ఈ ఆలయం ఆరోగ్య క్షేత్రంగా ప్రసిద్దిచెందింది. శారీరకంగా, మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించగల మహీమ కలదిగా ప్రాచుర్యం పొందింది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ జడల రామలిమ్గేస్వరస్వామి ఆలయం చెరువుగట్టు అనే గ్రామంలో నార్కేట్ పల్లి మండలం లోని నల్గొండ జిల్లలో పార్వతి సమేతంగా శంఖరుడు కొలువై వున్నాడు. ఈ ఆలయ క్రింది భాగంలో పార్వతి మాత కొలువై వుంటారు. గుట్టపై ఒక కోనేరు కూడా వుంది.

Sri Paarvati Jadala Rama Shiva Nalgonda AP

Sri Paarvati Jadala Rama Shiva Nalgonda AP

ఆలయ ప్రాముఖ్యత : 112 వ శతాబ్ధానికి సంభందించిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి చేత దీని నిర్మాణం జరిగింది. పశ్చిమదిశగా దర్శన మివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.ఎక్కడ లేనంతగా ఇక్కడ లింగం పైభాగంలో జడల ఆకారంకలిగి వుంటుంది . అతి పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. చెరువు గట్టు సమీపంలో ఎత్తైన కొండమీద 3 గుండ్ల మీద (పెద్ద రాతి బండ ) ఈ జడల రామలింగేశ్వర స్వామి కొలువై వున్నాడు. ఈ దైవాన్ని దర్శించుకునే మార్గం ఎంతో ఇరుకుగా వుంటుంది. ఈ స్వామిని దర్శించు కోవాలంటే ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. ఈ గుండ్ల పైకి పెద్ద బండ రాళ్ల పక్కనుంచి ఎంతో ప్రమాదకరమైన ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి. ఎంతో భక్తి భావంతో వున్నవారికి మాత్రమే దేవుని దర్శనం కలుగుతుందని భక్తుల విశ్వసిస్తారు. ఇటీవల దేవాదాయ శాఖ ఇనుప రాడ్లతో మార్గాన్ని కొద్దిగా సులభతరం చేసారు. ఇక్కడికి వచ్చినవారు దేవుని పాదాలను దర్శిస్తారు ,ఆపాదాలతో కొడితే భూత, ప్రేత,పిశాచాలు తొలిగిపోతాయని నమ్ముతారు. తోలిఏకాదశినాడు, కార్తికమాససోమవారాల్లో, పౌర్ణమినాడు, అమావాస్యనాడు మరియు శివరాత్రి రోజు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రతి ఈటా బ్రహ్మోత్సవాలు 3 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

స్థలపురానం : పూర్వం హైందవ వంస చక్రవర్తి కార్త్యవీర్యార్జునుడు కుటుంభ సమేతంగా అరణ్యానికి వేటకి వెళ్తాడు. అనంతరం అలసిపోవటం వలన విశ్రాంతి కోసం సమీపంలో వున్నా జమదగ్ని ఆశ్రమంకు వెళ్తాడు. అప్పుడు జమదగ్ని తన దగ్గర వున్నా సబల అనే గోమాత సహాయంతో వేళల్లో వున్న రాజు పరివారానికి క్షణాల్లో శాద్రశోపేతమైన విందుని ఏర్పాటు చేస్తాడు. ఆ దేనువు మహత్తును తెలుసుకున్న రాజు దాన్ని ఇమ్మని అడుగుతాడు. ఈ దేనువు తపః ప్రభావం వలన తనంతట తనే వుంటుందని ఎవరి దగ్గరకి రాదనీ చెప్తాడు. అప్పుడు రాజు దేనువును దూడతో సహా తెమ్మని సైనికులకు ఆదేశిస్తాడు. అప్పుడు జమదగ్ని నిన్ను నువ్వే రక్షించు కొమ్మని ప్రార్దిస్తాడు. అప్పుడు దేనువు రోమాలనుంచి రోమానికో సైనికుడు వివిధ ఆయుధాలతో ఉద్భవించి కార్త్యవీర్యుని సైన్యాని సంహరిస్తారు. కోపంతో రాజు జమదగ్నిపై యుద్దానికి రాగ జమదగ్ని కుమారుడు పరశురాముడు రాజుని ఓడిస్తాడు. కోపంతో వున్నా రాజు పరశుముడు లేని సమయం చూసి జమదగ్నిపై దండెత్తి జమదగ్నిని సంహరిస్తాడు. విషయం తెలుసుకున్న పరసురాముడు కార్యవీర్యున్ని సంహరిస్తాడు. అప్పటికి కోపం తగ్గక 21 మార్లు భూ ప్రదక్షిణ చేసి కనబడిన క్షత్రియులందరినీ సంహరిస్తాడు.క్షత్రియవధ అనంతరం పాప ప్రక్షాళన కోసం దేశం నలుమూలల 108 శివ లింగాలను ప్రతిస్టిస్తాడు. ప్రతిస్టించిన ప్రతీ లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపో ఫలాన్ని ఆలింగాలకి దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అల ప్రతిష్టించిన లింగాలలో చివరిది ఈ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ప్రదేశంలో పరశుముడు శివుని కొరకు ఎంత తపస్సు చేసిన ప్రత్యక్ష్యం కానందున,కోపగించుకుకున్న పరసురాముడు తన గొడ్డలితో లింగం ఊర్ద్వ భాగంపై పొడుస్తాడు. అంతట శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం పుణ్య ప్రదేశంగా ప్రసిద్దిచెందుతుందని వరమిస్తాడు. కలియుగానంతం వరకు ఇక్కడే వుండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్తాడు.అనంతరం పరశుముడు ఇక్కడేలింగాకారం లో శివ సాన్నిద్యాన్ని పొందాడు. పరశుముడు గొడ్డలితో పొడిచిన చోట జడల వంటి నిర్మాణం ఉంది.ఈ శివలింగాన్ని పరశుముడు ప్రతిష్టించడం వలన,జడల ఆకారం వుండడం వలన ఇది జడల రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ది చెందింది.

చేరుకునే విదానం : చిట్యాల రైల్వే స్టేషన్ కు 5 కి. మీ. దూరంలో ,నల్గొండకు 15 కి. మీ. దూరంలోను ,ఎల్లారెడ్డిగూడ బస్సు స్టాప్ కి 1 కి. మీ. దూరంలోను ,విజయవాడ రహదారిపై వున్నా నార్కెట్ పల్లికి 4 కి. మీ. దూరంలో వుంది.

Address

  • Sri paarvati Jadala Rama shiva temple in Nalgonda Andhra pradesh
    Cheruvugattu

    Nalgonda, Telengana - 508254
  • Media

Most Read Articles